Monday, April 29, 2024

ప్రత్యేక ఆహ్వానితులకు బ్రేకే

  • నియామకపు అమలు జీవోల నిలిపివేత
  • పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు
  • బీజేపీ పిటిషన్‌పై అక్టోబర్‌ 6న..టీడీపీ పిటిషన్‌పై 20న విచారణ
  • న్యాయ సలహా తీసుకుంటామని
  • మంత్రి వెల్లంపల్లి వెల్లడి

అమరావతి, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం దేవాదాయశాఖ చట్టంలోని 96సెక్షన్‌కు విరుద్ధంగా ఉందని ఈ నియామకాలకు సెక్షన్‌ 96 వీలు కల్పించటంలేదని తేల్చిచెప్పింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ వ ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోలకు నోటీసులు జారీ చేసింది. టీటీడీలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల 568, 569 జీవోలను జారీ చేసింది. వాటిని సవాల్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు, హిందూ జనశక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు కాకుమాను లలిత్‌కుమార్‌ వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేయగా, టీటీడీ పాలకమండలి సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలు కూడా చట్టబద్ధంగా లేవంటూ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి మరో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యా లపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ప్రత్యేక ఆహ్వానితులకు బోర్డుతో సంబంధంలేదు
పిటిషనర్‌ తరుపు న్యాయవాది వాదనల పట్ల ప్రభుత్వ అడ్వొొకేట్‌ జనరల్‌ ఎస్‌ శ్రీరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నియామకాలపై చట్టంలో ఎక్కడా నిషేధం లేదన్నారు. బోర్డు సభ్యులతో వారికి ఎలాంటి అధికారాలు ఉండవని చెప్పారు. పాలకమండలి సమావేశాలకు హాజరయ్యేందుకు, ఓటింగ్‌లో పాల్గొ నే అధికారం లేదన్నారు. దర్శనానికి సంంబధించిన వ్యవహారాల్లోనే బోర్డు సభ్యులతో సమాన అధికారా లు ఉంటాయని గతంలో కూడా ఇలాంటి నియామ కాలు జరిగాయని గుర్తుచేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేస్తామని కోర్టుకు నివేదించారు.
టీటీడీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు
పాలకమండలి, ప్రత్యేక ఆహ్వానితుల నియామ కాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగితే టీటీడీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఎస్‌ సత్యనారాయణ పిటిషనర్లను ప్రశ్నించారు. టీటీడీీకి ఫిర్యాదు చేయకుండా నేరుగా హైకోర్టులో పిల్‌ వేయటం సమం జసం కాదన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యంచేసుకుని ప్రత్యేక ఆహ్వానితుల నియా మకపు జీవోలను నిలుపుద ల చేస్తూ మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. ఇంతలో హిందు జనశక్తి సంక్షేమ సంఘం ప్రతినిధి కాకుమాను లలిత్‌కుమార్‌ తరుపు న్యాయ వాది పీవీజీ ఉమేష్‌చంద్ర వాదనలకు ఉపక్రమించగా ధర్మాసనం వారిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశాంకదా అని కుదరదని నిరాకరించింది.
నేర చరితులుంటే ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదు
టీటీడీ బోర్డులో పలువురు నేరచరితులుంటే వారిని ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో భాను ప్రకాశ్‌రెడ్డి తరుపు న్యాయ వాది ఎన్‌ అశ్వనీకుమార్‌ జోక్యం చేసుకుంటూ టీటీడీ సభ్యులుగా నియమితులైన వారిలో పలువురిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. నిజాయితీ, నైతిక విలువలు ప్రామాణికంగా బోర్డు సభ్యుల్ని నియమించాలని చట్టం చెప్తోందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ వారిని ప్రతి వాదులు గా చేర్చక పోవటా న్ని ఆక్షేపిం చిం ది. ఈ కారణంగా పిటిషన్‌ను కొట్టివేస్తామని పునరుద్ఘాటిం చింది. అఫిడ విట్‌ దాఖలు చేసేం దుకు కొంత గడువు కావాలని పిటిషనర్‌ తరుపు న్యాయ వాది కోర్టును అభ్యర్థించారు. ఇందుకు అంగీకరిస్తూ తదుపరి విచారణ వచ్చేనెల 6వ తేదీకి, టీడీపీ పిటిషన్‌పై వచ్చేనెల 20వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

చట్టంలో ప్రత్యేక ఆహ్వానితుల ప్రస్తావనే లేదు
ప్రత్యేక ఆహ్వానితులనే ప్రస్తావన చట్టం లో ఎక్కడాలేదని టీడీపీ పిటిషనర్‌ ఉమా మహేశ్వరనాయుడు తరుపు న్యాయవాది యలమంజుల బాలాజీ కోర్టు దృష్టికి తెచ్చారు. చట్టంలోని 96సెక్షన్‌ ప్రకారం చైర్మన్‌తో కలుపుకుని 29 మందిని బోర్డు సభ్యులుగా నియమించుకోవచ్చని అయితే ప్రత్యేక ఆహ్వానితులకు బోర్డు సభ్యులతో సమానంగా అధికారాలను కట్టబెట్టటం సరైంది కాదన్నారు. బోర్డు సభ్యుల నియామకం నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని అంగీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement