Friday, March 29, 2024

ఆంధ్రప్రభ ఎఫెక్ట్: రాములోరి సాక్షిగా రూ.3 కోట్లు బొక్కేశారు!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ కుంభకోణం ఆంధ్రప్రభ కథనాలతో బట్టబయలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ లో చోటు చేసుకున్న భారీ అక్రమం ఆంధ్రప్రభ కథనాలతో వెలుగులోకి వచ్చింది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ బ్యాంక్ సిబ్బంది భారీ మోసానికి పాల్పడగా, ఆంధ్రప్రభ బయటకు తెచ్చింది. రెండేళ్లపాటు ప్రజల సొమ్మును, ప్రజల విశ్వాసాన్ని వారు కొల్లగొట్టిన విషయమై గత నెల 27న బ్యాంక్ డైరెక్టర్‌ను ఆంధ్రప్రభ ప్రశ్నించింది. దీంతో అసలు తప్పేమీ జరగలేదన్న బ్యాంక్ డైరెక్టర్, విషయం చేజారి పోయిందని గ్రహించి చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఇదే విషయమై 28న మణుగూరు భద్రాద్రి బ్యాంక్ లో రూ.2 కోట్లు గోల్‌మాల్ అనే శీర్షికన తొలి కథనాన్ని ప్రచురించింది. ఆంధ్రప్రభ కథనంతో బ్యాంక్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో ఒక్కొక్కరుగా బాధితులు బ్యాంకు ఆశ్రయించడం, అక్కడ వారికి చుక్కెదురు కావడంతో పోలీసులను ఆశ్రయించారు.

భద్రాద్రి బ్యాంక్ మణుగూరు శాఖలో జరిగిన భారీ కుంభకోణానికి బ్యాంక్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణంగా పలువురు అభిప్రాయ పడుతున్నారు. బ్యాంక్ లో రోజువారి లావాదేవీలు, అక్రమ పద్ధతుల్లో సాగుతున్నా, కంప్యూటర్ డేటాతో రోజు వారి రిజిస్టర్ ను సరిపోల్చి ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బ్యాంక్ ఆడిటింగ్ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బ్యాంక్ సమయాలతో సందర్భం లేకుండా ప్రజల సొమ్ము బయటకు పోతున్నా, బ్యాంక్ లోకి వస్తున్నా ఐటీ విభాగం అసలు పట్టించుకోకపోవడమే ఈ భారీ కుంభకోణానికి కారణమని బ్యాంకింగ్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: వెదర్ అలర్ట్: రెండు రోజులు భారీ వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement