Wednesday, May 15, 2024

పత్రి ప్రియుడు విఘ్నేశ్వరుడు

వినాయకచవితి అనగానే పత్రి కోసం అన్వేషణ మొద లవుతుంది. వినాయకచవితి రోజున స్వామిని 21 రకాల పత్రితో పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. అవి- మాచీపత్రం.. కరవీరం.. విష్ణుక్రాంత.. దేవదా రు.. జాజీపత్రం.. బదరీ పత్రం.. అశ్వత్థ పత్రం..సిందు వార పత్రం.. బిల్వ పత్రం.. దూర్వార యుగ్మం.. మరువ క పత్రం.. చూతపత్రం.. గండకీ పత్రం.. దత్తూర పత్రం.. తులసీ పత్రం.. శమీపత్రం.. అపామార్గ పత్రం.. బృహతీ పత్రం.. దాడిమీ పత్రం.. అర్జున పత్రం.. అర్క పత్రం.
ఈ పత్రాలను పూజలో ఉపయోగించడం వెనుక పురాణ సంబంధమైన కారణమే కాకుండా, ఆరోగ్య సంబంధమైన కారణం కూడా వుందని శాస్త్రం చెబు తోంది. ఈ పత్రాలు సహజంగానే అనేక ఔషధాలను కలిగివుంటాయి. ‘మాచీపత్రం’ మూలవ్యాధినీ.. ‘కర వీరం’ చర్మ సంబంధమైన వ్యాధులను.. ‘విష్ణుక్రాంత’ కఫమును…’దేవదారు’ఎక్కిళ్ళను నివారిస్తాయి. ఇక ‘జాజీ పత్రం’ దగ్గును.. ‘బదరీపత్రం’ ఎముకలకు సం బంధించిన వ్యాధులను… ‘అశ్వత్థ పత్రం’ పాముకాటు వలన కలిగే ప్రాణహానిని అరికడుతుంది. ‘సిందువార పత్రం’ శూలవ్యాధిని .. ‘బిల్వపత్రం’ శరీర దుర్వాసన ను .. ‘మరువక పత్రం’ క్రిమికీటకాల వలన కలిగే విష ప్రభావాన్ని అరికడుతుంది. ‘చూత పత్రం’ విరేచనా లను ..’గండకీ పత్రం’ మూర్ఛ వ్యాధిని …’దత్తూర పత్రం’ శిరోజాలు రాలడాన్ని… ‘తులసీ పత్రం’ దగ్గు కఫమును నివారిస్తాయి. అలాగే ‘అపామార్గ పత్రం’ ఉబ్బసమును… ‘అర్క పత్రం’ ఉదర సంబంధమైన వ్యాధులను..’శమీపత్రం’ శ్వాస సంబంధిత సమస్య లను అరికడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్ట ఔషధ గుణాలు కలిగిన ఈ పత్రాల నుంచి పూజ సమయంలో కూడా సహజంగానే వాసన వెలువడుతుంటుంది. ఈ గాలిని పీల్చడం వలన కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని అంటారు.

వినాయకుడిని తులసితో పూజించకూడదా?
వినాయక చవితి రోజు మాత్రమే గణపతిని తులసి దళాలతో పూజించవచ్చు. మరి ఏ ఇతర రోజులలోనూ వినాయకుని తులసిదళాలతో పూజించకూడదు. అలా పూజించకపోవటానికి వెనుక ఒక కారణం ఉంది. వినాయకుడు ఒకసారి తపమాచరిస్తున్న సమయంలో తులసి ఆయన పట్ల మరులుకొని, ఆయనకు తపోభంగం చేసింది. తనను వివా#హ మాడమని కోరింది. గణపతి ఆమె కోరికను నిరాకరించినప్పటికీ ఆమె తన పట్టుదలను,కోరికను విడవక పోవడంతో ఆగ్ర#హం చెందిన గణశుడు ఆమె రాక్షసుని భర్తగా పొందుతుందని, వృక్షరూ పం పొందుతుందని శపించాడు. ఆమె తన తప్పు తెలుసు కుని క్షమించమని. ప్రాధేయపడింది, అప్పుడు ఆయన ఆమెను కనికరించి విష్ణుమూర్తికి ప్రియమవుతావని, ఆమె చెట్టుగా మారినా తులసి పేరున పూజింపబడతావని చెప్పారు. తులసిదళాలతో కూర్చబడిన మాల విష్ణుమూర్తి మెదలో అలంకారంగా మారుతుందనీ, తులసిదళాలతో చేసే పూజ విష్ణువుకు ప్రీతికరమవుతుందని, తులసి మొక్క పరమపవిత్రమవుతుందని చెప్పి వినాయకుడు తులసికి ఆనందాన్ని కలిగించాడు.

విశ్వకళ్యాణ మూర్తీ… గణేశా!

శ్రీకర-జ్ఞాన చంద్రికా శ్రీలు చెలగు
భాద్రపద శుద్ధ చవితిని ప్రతి గృహమ్ము
పచ్చమావి తోరాలు రెపరెపలాడ
శ్రీ వినాయకా! భువికి విచ్చేయుమయ్య!!

ముంగిట రంగవల్లికలు ముద్దులు చిల్కగ- భక్తి పొర్లగన్‌;
బంగరు పాలవెల్లికకు పచ్చమామిడి మాలవ్రేల; హృ
త్ప్రాంగణి కొల్వుదీరగను పార్వతి నందన! కోటి సూర్యశో
భాంగ! ‘గజాననా!’ పదపుటందెలు ఘల్లుమనంగ రమ్మికన్‌!!

- Advertisement -

అష్టోత్తర శతపత్రార్చన చేయగ-
సకల శుభాలిచ్చు- ‘సంకటహర’!
ముత్యాల గొడుగును- ముద్దుగ పట్టిన-
విద్యానిధులనిచ్చు- ‘వేదపురుష”!
మూడు గుంజీలతో- ముచ్చటగను మ్రొక్క-
అభ్యుదయాలిచ్చు- ‘అగ్రపూజ్య’!
పానకాలుండ్రాళ్ళు- పండ్లు తేనెల
ర్పించగ సిరులిచ్చు- ‘విష్ణురూప’!
భక్తి మీర- మందార- బిళ్వ- గరిక- తుల
సీ- మరువక- శమీ- జాజి- సింధువార
పత్ర- పుష్పాల- పూజించు- భక్తజనుల
కఖిల భాగ్యాలొసగుమయ్య! ‘ఆదిదేవ’!!

తెలుగు వెలుగుల- పసిడి మందిరమునందు-
పాలవెల్లి- పసుపు పీటపై- ప్రతిమను
నిలిపి- పుస్తకము- కలము- పలక నుంచి
పూజచేయు బాలల బ్రోవుమో గణేశ’!

సత్య- శివ- సుందర ప్రసన్నమూర్తి!
ఆర్తజనులను రక్షించు ఆర్ద్రమూర్తి!
విఘ్నముల బాపి- శుభవర విజయములిడి
విశ్వకళ్యాణమూర్తి! దీవించుమయ్య!!

భరతఖండమ్ము- శాంతి సంపదల విరియ;
తెలుగునేల- సౌభాగ్యాల తేజరిల్ల;-
లోక రక్షకా! శుభకరా! ‘ఏకదంత’!
శ్రీలొసగి సదా మమ్ము రక్షించుమయ్య!!

  • కళ్యాణశ్రీ
    96403 21630
Advertisement

తాజా వార్తలు

Advertisement