Wednesday, April 24, 2024

Breaking: బంగ్లాదేశ్‌పై ఆఫ్గాన్ విజ‌యం.. సూప‌ర్‌ఫోర్‌లోకి దూసుకెళ్లిన కుర్రాళ్లు

ఆసియాక‌ప్‌లో ఇవ్వాల (మంగళవారం) బంగ్లాదేశ్‌తో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో ఆఫ్గ‌నిస్తాన్ విజ‌యం సాధించింది. ఇది వ‌రుస‌గా రెండో విజ‌యం. 7 వికెట్ల తేడాతో బంగ్లాపై ఆఫ్గాన్ గెలుపొందింది. దీంతో సూప‌ర్ ఫోర్‌లోకి ఆఫ్గాన్ జ‌ట్టు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఏడు వికెట్లు కోల్పోయి 127 ప‌రుగులు చేసింది.

128 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆఫ్గాన్ జ‌ట్టు మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 131 పరుగులు చేసి టార్గెట్ ఛేదించింది. కాగా, హ‌జ్ర‌త్ జ‌జాయ్ (23), మ‌హ్మ‌ద్ న‌బి (8) ప‌రుగులు చేశారు. ఇబ్ర‌హీం జ‌ర్దాన్ 42, నిజ్బుల్లా జ‌ద్రాన్ 43 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement