Saturday, May 18, 2024

నేటి రాశి ప్రభ (26-9-21)

మేషం
పనుల్లో తొందరపాటు-. ప్రయాణాలలో మార్పులు, దైవదర్శనాలు. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. ఆర్ధిక ఇబ్బందులు, వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

వృషభం
సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరాశ. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిధునం
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం
పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం
వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు. ఒప్పందాలు కుదురుతాయి. వస్తులాభాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు పాన్గా సాగుతాయి.

- Advertisement -

కన్య
దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటు-ంది. పనుల్లో ఆటంకాలు, బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

తుల
పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి
విముక్తి.

వృశ్చికం
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి, ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.

ధనుస్సు
రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కనిపిస్తుంది.

మకరం
ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. స్థిరాస్తి వివాదాలు, విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కుంభం
ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలిసివస్తాయి. సంఘంలో గౌరణం. భూవివాదాలు పరిష్కారం. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం
నూతన ఉద్యోగ ప్రాప్తి. సమాజంలో ప్రత్యేక గౌరవం. భూలాభాలు పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement