Saturday, May 4, 2024

నేటి రాశి ప్రభ (19-5-2021)

మేషం:
పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. సోదరులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

వృషభం:
పరిస్థితులు అంతగా కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక
కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం:
విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం:
సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. స్థిరాస్తి వృద్ధి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం:
ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కన్య:
ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. కుటు-ంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

తుల
వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం:
కుటు-ంబంలో కొద్దిపాటి చికాకులు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలయ దర్శనాలు. మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

ధనుస్సు:
శుభవార్తలు వింటారు. ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మకరం:
ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దైవదర్శనాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం:
పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తు, ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీమాటే చెల్లుతుంది.

మీనం:
నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త వ్యవహారాలు ప్రారంభిస్తారు. సమాజంలో విశేష గౌరవం. వాహనయోగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement