Monday, May 6, 2024

నేటి రాశి ప్రభ (14-6-2021)

మేషం:కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తిలాభాలు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో కొంత అనుకూలత.

వృషభం: ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆస్తిలాభం. ప్రముఖ వ్యక్తుల నుంచి సాయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం. కళాకారులకు కొత్త ఆశలు. వాహనయోగం.

మిథునం: కార్యక్రమాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలలో మరింతగా ఒత్తిడులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కర్కాటకం: కుటు-ంబంలో చికాకులు. కొన్ని పనుల్లో అవరోధాలు. ధనవ్యయం. మిత్రులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. కళాకారులకు అవకాశాలు నిరాశకు గురిచేస్తాయి.

సింహం: ఉద్యోగప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనలబ్ధి. వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

- Advertisement -

కన్య: మీ యత్నాలకు కుటు-ంబసభ్యుల నుంచి ఆటంకాలు. అనారోగ్యం. మిత్రులతోవిభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: పరిచయాలు విస్తరిస్తాయి. అందరిలోనూ గుర్తింపు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆప్తుల సహాయం అందుతుంది.వ్యాపారాలు,ఉద్యోగాలుఉత్సాహంగాసాగుతాయి.

వృశ్చికం: సన్నిహితులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి

ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యొగాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తివృద్ధి. కాంట్రాక్టర్లకు అనుకూలం.

మకరం: ఆదాయం సమృద్ధిగా ఉంటు-ంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. భూ, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కుంభం: కుటు-ంబబాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు.వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. సోదరులతో తగాదాలు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement