Wednesday, May 15, 2024

నవనీత కృష్ణునిగా శ్రీకోదండరామస్వామి కటాక్షం

ఒంటిమిట్ట ప్రభ న్యూస్‌:అన్నమయ్య జిల్లా, ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం నవనీత కృష్ణాలంకారంలో స్వామివారు కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీకోదండరా మస్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ- ఈఓ డా. రమణప్రసాద్‌, ఏఈఓ సుబ్రహ్మణ్యం, సూపరిం-టె-ండెంట్‌ పి.వెంకటేశయ్య, -టె-ంపుల్‌ ఇన్స్పెక్టర్‌ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement