Sunday, April 28, 2024

ధర్మ పరిరక్షణావతారం

(ఆది శంకరుల జయంతి సందర్భంగా ఈ వ్యాసం)
సనాతన ధర్మం పేరు విన్న వారెవరికీ ఆదిశంకరుల గురించి తెలియకుండా ఉండదు. వేద మత పునరు ద్ధరణకై వ్యాసుల వారి తర్వాత సాక్షాత్‌ శంకరుడే ఆది శంకరుల రూపంలో అవతరించాడు. వ్యాసుల వారు నారాయణ స్వరూపులైతే, ఆది శంకరులు శివ స్వరూపం. శాఖోపశా ఖలుగా చీలి పోతున్న వైదిక మతాన్ని ఒక త్రాటిమీదకు తెచ్చి వైదిక ధర్మాన్ని పునరుజ్జీవింపజేసిన మహానుభావులు శంకరులు. ఆయన సనాతన ధర్మ పరిరక్షణకు చేసిిన సేవ మరువలేనిది. అయితే ఆయ నలో అదొక్కటే కాక ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అవి కూడా అలవ రచు కోవలసినవే, ఆచరణీయాలే.
మాతృభక్తి
ఆతుర సన్యాసానికి అనుమతించిన తల్లికి తనను తలచుకున్న వెంటనే వస్తానని, అవసాన కాలంలో కుమారునిగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తానని మాట ఇచ్చారు. తల్లి వైధవ్యం పొందగా పండి తులు అభ్యంతరం చెప్పినా లెక్క చేయక స్వయంగా అంత్యక్రి యలు జరిపి కుమారునిగా తన కర్తవ్యం నిర్వర్తించారు. మాతృ భక్తికి ఆదర్శంగా నిలిచారు.
దేశభక్తి – కార్యదీక్ష
శంకరుల కాలంలో అవైదిక మతాలు అందలమె క్కాయి. ఆనాటి రాజులు ఆయా మతాలను స్వీకరించ టమే కాక వాటి వ్యాప్తికి కృషి చేశారు. వైదిక మతం ఈ భూమిపై అంతరించే ప్రమాదం ఏర్పడింది. ఆ పరిస్థ్థి తుల్లో దేశంలో ఉన్న అవైదిక మతాలన్నిటినీ ఒక వేది క పైకి తీసుకువచ్చి ఆయా మతాల్లో ఉన్న ఛాందస తత్త్వాన్ని నిర్మూలించి, వైదిక మత ఔన్నత్యాన్ని నిల బట్టి ‘షణ్మత స్థాపనాచార్య’గా వినుతి గడించారు.
షణ్మత స్థాపనాచార్యస్త్రయీ మార్గ ప్రకాశక:
వేద వేదాంత తత్త్వజ్ఞో దుర్భాతి మత ఖండన:
(శంకరాచార్య అష్టోత్తర శతనామం)
ఈ లక్ష్యంతో దేశంలోని అన్ని క్షేత్రాలను దర్శించి, కొన్నిటిని పునరుద్ధరించి, మరి కొన్నిటిలో శ్రీచక్రాలను, యంత్రాలను ప్రతిష్ఠించి నిత్యనైమిత్తిక కర్మలను, పూజా విధానాలను నిర్దేశించి, దేశంలో దేవాలయ వ్యవస్థను పటి ష్టం చేసి దేశ భక్తిని, కార్యదీక్షను, చాటుకున్న మహామనీషి ఆదిశంకరులు. తిరుమల, శ్రీకాళస్తి, శ్రీశైలం, కనకదుర్గ ఇత్యాది ఆలయాలు అత్యున్నత స్థాయికి ఎదిగాయంటే అది ఆదిశంకరుల కృషి ఫలితమే!
మానవీయతకు మరో పేరు
భిక్షకై వెళ్ళినపుడు దీనురాలైన ఒక గృహిణి బాధతో, సం కోచంతో ఒక ఉపిరికాయను భిక్షాపాత్రలో సమర్పించడం గమ నించి హృదయం ద్రవించి కనకధారా స్తవంతో శ్రీమహాల క్ష్మిని అర్చించి ఆమె ఇంట దారిద్య్రాన్ని రూపుుమాపిన కరుణా సము ద్రుడు, మానవీయతకు మరో పేరు ఆదిశంకరులు.
వినయ విధేయతలు – న్యాయ తత్పరత
వైదిక ధర్మాన్ని పరిరక్షించడానికి శంకరులు ఆనాటి పండి తులందరితో వాదప్రతివాదాలు చేశారు. ఆయన ప్రత్యర్థులంతా వయసులో అయన కంటె పెద్దవారే. అటువంటివారిని ఓడించినా వారి పట్ల అమితమైన గౌరవ ప్రపత్తులు ప్రదర్శించారు. ఉదాహ రణకు మండనమిశ్రునితో వాదించి గెలిచి, ఆతని ప్రతిభకు మెచ్చి, తాను సంకల్పించిన చతురామ్నాయాలలో శృంగేరి పీఠానికి తొలి అధిపతిగా నియుక్తుల్ని చేశారు. అదే విధంగా తమ వాద ప్రతివా దాలకు న్యాయనిర్ణేతగా మండనమిశ్రుని భార్య ఉభయ భారతిని నియమించారు. ఆమె సాక్షాత్తు శారదాదేవి అని గ్రహించి శృంగేరి పీఠంలో శారదామాతగా కొలువై ఉండమని అర్థించారు.
శాస్త్రీయ దృక్పథం
శంకరులది పిడివాదం కాదు. శాస్త్రీయ దృక్పథం. వేదాంత మార్గానికి తన శాస్త్రీయ దృక్పథాన్ని సమన్వయింపజేశారు. అద్భుత మేధాశక్తి, పాండిత్యం ప్రదర్శిస్తూ అనేక ప్రకరణ గ్రం థాలు, 23 భాష్య గ్రంథాలు, తాను దర్శించిన దేవీ దేవతలపై పుంఖా నుపుంఖాలుగా స్తోత్రాలను రచించి సంస్కృత వాఙ్మయాన్ని పరిపుష్టం చేశారు.
వ్యవస్థా నైపుణ్యం
ఆదిశంకరుల జీవితంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందీ, ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని దీటుగా నిలిచేవి ఆయన నెలకొల్పిన చతు రామ్నాయాలు. ఆచంద్రార్కం వైదిక మతం వర్ధిల్లడానికి, అద్వైత మతం వ్యాప్తి చెందడానికి, భారత దేశం నాలుగు దిక్కులా నాలుగు మఠాలను స్థాపించారు. అవి పశ్చిమాన ద్వారక, తూర్పున పూరీ, ఉత్త్తరాన బదరీ, దక్షిణాన శృంగేరీలో. ఆ మఠాల నిర్వహణకు కావా ల్సిన అన్ని వివరాలు అంటే పీఠ నియయాలు, వ్యాప్తి చేయాల్సిన ధార్మిక అంశాలు, పీఠనామం, పఠించా ల్సిన వేదం, మహావాక్యం, పీఠానికి చెం దిన శక్తి, తీర్థం, క్షేత్రం, యోగ పట్టం మొదలైనవన్నీ శంకరులు నిర్దేశిం చారు. తొలి పీఠాథిపతులుగా తన తొలి నలుగురు శిష్యులను శృంగేరి మినహా బ్రహ్మచారులనే నియమిం చారు. శృంగేరికి మాత్రం వివాహి తులు, వైదిక ధర్మ నిష్ణాతులు అయిన శ్రీసురేశ్వరాచార్యులను నియమిం చారు.
తాను కంచి కామ కోటి పీఠాన్ని అధిరోహించి కొంత కాలం కామాక్షీ ఏకామ్రేశ్వరుల సేవలో గడిపి పీఠాన్ని ముఖ్య శిష్యునికి ”సర స్వతి” యోగ పట్ట్టంతో అను గ్రహించి తిరిగి ఉత్తర దేశ యాత్రకు వెళ్లారు. ఆ సమ యం లోనే కాశ్మీరంలో ఉన్న శారదా దేవి మందిరంలో ఉన్న సర్వజ్ఞ పీఠాన్ని దేశం నలు మూలల నుంచి వచ్చిన పండితులను పరాజి తులను చేసి అధిష్ఠించారు.
ఆ సమయంలో శంకరులు మనసులో చిరకాలంగా ఉన్న వ్యాసుల వారి శిష్యులు, తమ గురువు గోవింద భగవత్పాదుల గురువు అయిన గౌడసాదులను దర్శించాలన్న కోర్కె మిక్కుట మైంది. దానితో అతని ముందు గౌడ పాదులు సాక్షాత్కరించారు. శంకరులు ఆనందపరవశులై పాదాభివందనం చేశారు. అప్పుడు గౌడపాదులు ” శంకరా! నీ ఆయువు పూర్తి కావస్తున్నది. నీ కృషిి ఫలించింది. నీ అవతారాన్ని శివ దర్శనంతో పూర్తి చేసుకుని కైవల్యం పొందు” అని ఆదేశించారు. శంకరులు కేదారం వెళ్ళి శివ దర్శనం పొంది ఉత్తరంగా పయనించి అనంత విశ్వంలో కలిసారు.
శ్రుతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరమ్‌

– ఎ. సీతారామారావు, 89787 99864

Advertisement

తాజా వార్తలు

Advertisement