Sunday, May 5, 2024

ధన్వంతరి జయంతి

ధన్వంతరి జయంతి సందర్భంగా ధన్వంతరి అవతారం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివిరణ

దేవతల ప్రార్థన మేరకు శ్రీహరి వారికి అమృతము అందించాలనే సంకల్పముతో క్షీరసాగర మదనం జరింపించగా క్షీరసాగరమున అమృతభాండము తీసుకుని ధన్వంతరి ఆవిర్భవించెను. ధన్వంతరిని అమృత పురుషుడు అని అంటారు. ‘ధను’ అనగా చికిత్సకు అందని వ్యాధి, ‘అంత’ అనగా నాశము ‘రి’ అనగా కలిగించువాడు. చికిత్సకు లొంగని వ్యాధులను న శింపచేయువాడు అని ధన్వంతరి శబ్ధానికి అర్థము. సకల లోకాలలో చికిత్సకు అందని వ్యాధి మరణమే కావున దానిని తొలగించి అమృతాన్ని ఇచ్చి అంతర్థానం అయినట్లు భాగవతాది పురాణాలలో చెప్పబడింది. అలా వచ్చిన స్వామి వృక్షశాస్త్రమును, ఔషధ శాస్త్రమును చికిత్సా విధానాన్ని వివరించే 18 మహా గంథ్రాలను అందించారు. వాటిని ఆధారంగా చేసుకుని చ్యవన, అత్రి, బృహస్పతి, కవి, చంద్ర, వరుణ, మను, ఇక్ష్వాకు మొదలగువారు వైద్య శాస్త్ర గ్రంథాలను అందించారు. ఇలా ధన్వంతరి వైద్య శాస్త్రాన్ని ఆరోగ్య సూత్రాలను అందించారు.

ఆశాచ పరమా వ్యాధి: తతో ద్వేష: తతో మను: |
తేషాం వినాశనే వైద్యం నారాయణ పరాస్మృతి: ||

ధన్వంతరి అను గ్రంథానుసారం అన్ని వ్యాధుల కంటే పెద్ద వ్యాధి ‘ఆశ’ తర్వాత ‘ద్వేషం’ ఆ తర్వాత ‘కోపం’ ఈ మూడు వ్యాధులకు చికిత్స నారాయణ మంత్రం. ఇటువంటి ఆధ్యాత్మిక వ్యాధి నివారణ, ఆది భౌతిక వ్యాధి నివారణ, ఆది దైవిక వ్యాధి నివారుణలకు వైద్య శాస్త్రాన్ని ప్రవర్తింపచేసిన వాడు ధన్వంతరి.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement