Thursday, May 2, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 22-25
22.
శ్రీభగవాన్‌ ఉవాచ
ప్రకాశం చ ప్రవృత్తిం చ
మోహమేవ చ పాండవ |
న ద్వేష్టి సంప్రవృత్తాని
న నివృత్తాని కాంక్షతి ||

23.
ఉదాసీనవదాసీనో
గుణౖర్యో న విచాల్యతే |
గుణా వర్తంత ఇత్యేవ
యోవతిష్ఠతి నేంగతే ||

24.
సమదు:ఖసుఖ: స్వస్థ:
సమలోష్టాశ్మకాంచన: |
తుల్యప్రియాప్రియో ధీర:
తుల్యనిందాత్మసంస్తుతి: ||

25.
మానావమానయోస్తుల్య:
తుల్యో మిత్రారిపక్షయో: |
సర్వారంభపరిత్యాగీ
గుణాతీత: స ఉచ్యతే ||

22-25 తాత్పర్యము : దేవదేవుడైన శ్రీ కృష్ణుడు పలికెను : పాండుపుత్రా! ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషింపనివాడు మరియు అవి లేనప్పుడు ఆకాంక్షింపనివాడను, గుణములే పనిచేయుచున్నవని యెరిగి వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదుల యందు నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనునిగాను, దివ్యునిగాను చిలుచువాడును, ఆత్మ యందే స్థితుడై సుఖ దు:ఖములు ఏకమని బావించెడివాడును, మట్టిముద్ద, రాయి, బంగారములను సమముగా వీక్షించెడివాడును, ప్రియాప్రియములందు సమముగా వర్తించెడి వాడును, నిందాస్తుతుల యందు, మానావమానముల యందు సమత్వమున నిలుచు ధీరుడను, శత్రుమిత్రులను సమముగా చూచువాడును, సర్వములైన భౌతిక కర్మలను విడి చినవాడును అగు మనుజుడు ప్రకృతి గుణములను దాటినవాడుగా చెప్పబడును.

- Advertisement -

భాష్యము : మొదటి ప్రశ్నకు సమాధానముగా శ్రీ కృష్ణడు దివ్య స్థరములో నిలిచిన వ్యక్తి ద్వేషము లేదా అసూయను కలిగి ఉండడు మరియూ దేనినీ ఆశించడని తెలియజేయుచున్నాడు. ఈ శరీరములో ఉన్నంత వరకూ త్రిగుణముల ప్రభావము ఉంటుంది. కాబట్టి సమత్వము చాలా ముఖ్యము. అది ఎట్లు సాధ్యమనగా భగవద్భక్తిలో నిమగ్నమై ఉన్నట్లయితే ఈ శరీరముతో ఉండే సంబంధమును మరచి పోవచ్చును. అయితే మనము జీవించనంత కాలము ఈ శరీరము అవసరము. కాబట్టి భక్తుడు తన చైతన్యమును కృష్ణునిపై నిలిపి, శరీరమును అనుభవించవలెనని గాని, వదిలిపెట్ట వలెనని గాని కోరక దివ్యస్థితిలో ఉండగలుగుతాడు.

ఇక రెండవప్రశ్నకు సమాధానముగా దివ్యస్థరములో నిలిచిన వ్యక్తి తన బాధ్యతలను నిర్వహించుటలో ఎంతగా నిమగ్నుడై ఉంటాడంటే ఈ శరీరమునకు ఇచ్చు గౌరవముగాని అగౌరవముగాని అతనిని చలింప చేయలేదు. కృష్ణుని తరుపున తన భాద్యతలు నిర్వహించుటకే దేనినైనా స్వీకరించును గాని లేకుంటే బంగారమైనా రాయితో సమానమే. ఈ భౌతిక పరిస్థితులు అశాశ్వతము కాబట్టి సామాజిక, రాజకీయ విప్లవాల పట్ల ఆసక్తి కనబరచడు. తన కోసము ప్రత్యేకముగా ఏదియు చేయుటకు పూనుకోక కేవలము కృష్ణుని కోసమే పని చేయును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement