Friday, April 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 3
3.
త్యాజ్యం దోషవది త్యేకే
కర్మ ప్రాహుర్మనీషిణ: |
యజ్ఞదానతప:కర్మ
న త్యాజ్యమితి చాపరే ||

తాత్పర్యము : సర్వ కామ్యకర్మలు దోషము వలె త్యాజ్యములని కొందరు వి జ్ఞులు పలుకగా, యజ్ఞము, దానము, తపస్సనెడి కర్మలు ఎన్నడును విడువరానివని మరికొంరు మునులు పలుకుదురు.

భాష్యము : వేదాలలో తెలుపబడిన కొన్ని కార్యముల పట్ల వేరు వేరు వ్యక్తులు పరస్పర విరుద్ధ భావాలను కలిగి ఉందురు. ఉదాహరణకు యజ్ఞముల యందు జంతువులను ఆహుతి చేయుట. కొందరు హింస క్రూరమని ఈ కార్యములను తిరస్కరిస్తారు. మరికొందరు ఆ విధముగా యజ్ఞములో అర్పించిన జంతువు కొత్త జన్మ పొందుట కాని, మానవ జన్మకు ఉద్ధరింపబడుట గాని జరుగుతుంది కనుక అటువంటి కార్యములో తప్పు లేదని భావించుదురు. ఇటువంటి క్లిష్ట కార్యముల పట్ల స్వయముగా భగవంతుడే రాబోవు శ్లోకములలో వివరణ ఇవ్వబోవుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement