Monday, April 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 20
20.
ఆసురీం యోనిమాపన్నా
మూఢా జన్మని జన్మని |
మామప్రాప్యైవ కౌంతేయ
తతో యాంత్యధమాం గతిమ్‌ ||

తాత్పర్యము : ఓ కౌంతేయా! అసురయోనుల యందే మరల మరల జన్మించి అట్టివారు నన్నెన్నడును పొందకజాలక క్రమముగా అతి హేయమైన జన్మలకు పతనము నొందుదురు.

భాష్యము : భగవంతుడు దయామయుడైతే ఈ శ్లోకములో అసురుల పట్ల ఆ దయా గుణాన్ని ప్రదర్శించుచున్నట్లు లేదు కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చును? అసురులకు భగవంతుని కృపను పొందలేనటువంటి అధమ జన్మలను చివరకు జంతు జన్మలను ఇవ్వటము జరుగుచున్నది. అయితే వేదాంత సూత్రములలో భగవంతుడు ఎవ్వరినీ ద్వేషించడని తెలియజేయటమైనది. అనగా ఆయన అసురులను ఈ విధముగా శిక్షించుట కూడా మరొకరకమైన కృపేనని మనము అర్థము చేసుకొనవలెను. శాస్త్రములలో దీనికి బహు ఉదాహరణలు కలవు. రావణాసురుడు, కంసుడు, హిరణ్యకశిపుడు వంటి అసురులు భగవంతుని చేత చంపబడ్డారు. భగవంతుడు వారిని సంహరించుట కొరకు వేరు వేరు అవతారాలను దాల్చెను. వేదాల ప్రకారము ఎవరైతే భగవంతుని చేత చంపబడతారో వారు ముక్తిని పొందుతారు. కాబట్టి భగవంతుడు అసురుల పట్ల కూడా ఇటువంటి కరుణ చూపించునని అర్థమగు చున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement