Saturday, May 4, 2024

ఊహకు అందని విధివిలాసాలు!

మారన కవి ప్రణీతమైన భాస్కర శతకం మానవ ధర్మాలను ఎన్నిటితో తెలిపింది. మాన వుడు జీవితంలో ఆచరించా ల్సిన, ఆచరించకూడని ఎన్నో నీతులను సామె తల రూపంలో అందించింది. లోక కళ్యాణానికి పలు సూక్తులు మనో జ్ఞంగా వివరించి మానవ నడవడికలను తెలుపు తుంది. కవి రచించిన ప్రతి పద్యంలో జీవన విధానాలు వర్ణించ బడినవి.
కలియుగంలో మానవులు వ్యావహారికంగా చెప్పుకునే కొన్ని సామెతలలో ఒక సామెతను దైవ, మానవ పరంగా రచించుట అదృష్టము. ఆ సామెత నిత్య వ్యవహారంలో ఒక్కో సమయంలో కాని పనికానే కాదనీ తెల్పిన పద్యం తెలుసుకుందాం. ఈ పద్యం దైవ పరంగా అర్థంచేసుకొని, నిజానిజాలను అర్థం చేసుకుందాం. ఈ పద్యం చూడండి.
ఉ|| కానీ ప్రయోజనంబు సమకట్టదు- తాభువినెంత విద్యవా
డై నను దొడ్డ రాజు కొడుకైనన దెట్లు మహేశు పట్టి- వి
ద్యానిధి- సర్వ విద్యలకు దానెగురుండు- వినాయకుండు- దా
నేనుగు రీతి నుండి యు- నదేమిటి కాడడు పెండ్లి భాస్కరా||
అంటూ ఈ ప్రపంచంలో తానెంత విద్వాంసుడైనా, మహారాజు బిడ్డ అయినా, ఒక్కోసారి పని కానేకాదు. అది వారి లలాట లిఖి తంలో నిండి వున్న విషయం. కవి ఈ పద్యంలో ఒక పద్య పాదంలో ఉపమానంగా మహాదేవుడైన శివుని కుమారుడూ, సకల విద్యల కూ గురువూ, విద్యానిధి అయిన గణపతి అంటే వినాయకుడు ఏను గంత బలంగల వాడైననూ ఆయనకు వివాహం అనగా పరిణయం జరుగలేదు. ఆయన వివాహం ఎందుకు చేసుకోలేదు?
కార్య కుశలుడు కావడానికి జ్ఞానం కావాలి. జ్ఞానంగలవాడే ఏ పని చేయడానికైనా సమర్థుడు. అలాగే అధికారమూ, సంపద, ఐశ్వ ర్యం కలవాడు ఐశ్వర్య యుక్తుడు. ఈశ ఐశ్వర్యే అని అమరకోశం తెలిపింది. విద్యలకు నిలయమైన వాడు. విద్యానిధి వినాయకుడు గదా! భారతీయ సనాతన సాంప్రదాయంలో అష్టాదశ మహా విద్య లున్నాయి. నాలుగు వేదాలు, ఆరు వేదాంగాలైన శిక్ష- వ్యాకరణం – చందస్సు- నిరుక్తం- జ్యోతిషం- కల్పం, వీటితో పాటు మీమాం స- న్యాయం- పురాణం ధర్మ శాస్త్రం అనేవి నాలుగు, ఈ పధ్నా లుగు కలిపి చతుర్దశ విద్యలు అంటారు. వీటికి ఉపవేదాలు నాలుగు కలపాలి. అవి ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్థ శాస్త్రం. అన్నీ కలిపితే అష్టాదశ మహా విద్యలు అవుతాయి. ఈ విద్య లకు నిలయమైన వాడు వినాయకుడు. అమరకోశంలో వినాయ కుడంటే వినయతి- శిక్షయతి దుష్టాన్‌- విఘ్నాంశ్చేతి వినాయక: అని వుంది. దుష్టులను, విఘ్నాలను శిక్షించేవాడని అర్థం. విగతో నాయక:
ప్రభుర్యస్య- స్వతంత్ర త్వాత్‌ అని, విశిష్టోనాయక: వినా యక: అని మరో అర్థం. స్వతంత్రుడు తనకంటే ఇతర ప్రభువులు లేని వాడువి అనగా ఆకాశం. నాయకుడంటే నియామకుడు. వే: నాయక: అనగా ఆకాశ తత్వాభిమాని సూక్తి.
శబ్ద గుణకం ఆకాశం. ఇది నియమితమైన వర్ణాల యొక్క క్రమోపస్థితి. వర్ణాలు రెండు రకాలుగా వ్యాప్తమౌతాయి. వ్రాసిన ప్పుడు రేఖా రూపంగా, పలికినప్పుడు ధ్వని రూపంగా వినిపిస్తా యి. శబ్ద సంఘాతమే విద్య. సందేహాలు లేకుండా చేసి సంపూర్ణ విజ్ఞానం అందించే విద్య విద్యకు కలిపి ధ్వని అని రెండు రూపాలు. వాగర్థ స్వరూపులైన పార్వతి పరమేశ్వరుల పుత్రుడు వినాయ కుడు. మహాభారత రచనను వ్యాస మహర్షి చెబుతుంటే వినాయ కుడు లేఖకుడుగా ప్రవర్తించాడు. అది ఆయన విజ్ఞానాత్మక వ్యక్తి త్వానికి నిదర్శనం. అంతటి మహనీయ వ్యక్తిత్వం గలవాడు. కవి విద్యానిధి అంటూ సర్వ విద్యలకు తానే గురుండుగా వర్ణించాడు. ఈ భావమునే సుభాషిత సుధలో రత్నంగా వెలిగింది ఇలా-
శ్లో|| మాతాయస్య- ధరా ధరేంద్ర మహిత తాతోమహేశస్తధా
భ్రాతా విఘ్న కులాంతక: పితృ సఖోదేవో ధనానాం పతి:
ఖ్యాత: క్రీంచ విదారణ సుర పతే: సేనాగ్రగ: షణ్ముఖ:
తద్ధుర్ధైవ బలేన కుత్ర ఘటతేనాద్యా విపాణి గ్రహ:”
ఈ శ్లోకంలో శివ కుటుంబ వర్ణన జరిగింది. తల్లి పర్వత రాజైన హిమవంతుని కూతురు. తండ్రి మహేశ్వరుడు. తానేమో విఘ్న కులాంతకుడు. తన తండ్రికి మిత్రుడు ధనేశుడైన కుబేరుడు కేంద్ర పర్వతమును చీల్చినవాడు దేవ సేనాపతియైన షణ్ముఖుడు తోబు ట్టువు. ఇంత ప్రసిద్దుడైన దుర్విధి చేత ఈనాటికి కూడ పరిణయం అనగా పాణిగ్రహణం సమకూరడంలేదు అని ఎంతటి వారికైనా విధి విలాసం తప్పదని పై పద్యం సారాంశము.
విధి విలాసాలు సముద్ర తరంగాలు. అవి ఊహ కందనివి. అంతటి దైవసంపద, జ్ఞానం కలిగి యున్నప్పటికీ వివాహం అనేది జరుగకపోవడం విధివ్రాత.
అది తప్పించుట ఎవరి తరం కాదు. విధి వ్రాతను పరమే శ్వరుడు సైతం తప్పింపజాలడని పద్యం ధ్వని. యదబావి నతద్భావి భావిచేన్నత దన్యధా అని శాస్త్రం అనగా కానిది కానేరదు. కానున్నది కాకమానదు.
ఏ పనిచేసినా పుణ్యవశం వలన ఈలోకంలో కలుగదగనిది కలుగదు. కలగాల్సిన వాటికి నాశమెక్కడిది అనే సూక్తులు. దైవ పరంగా విధి విలాసం అలావుంటే ఇక సామాన్యుల విధి విలాసాలు మరీ విచిత్రంగా వుంటాయి కదా? ఇందులో సందేహం లేదు.
”కాగల పనులెట్లు కాక వును కాని పనులు భువిని కానేకావు. కానిది కానే కాదు. పనికి గల దెప్పుడు కాకపోదు” అనే విలోక్తులు మారన కవి ఆధ్యాత్మిక చింతనతో గణపతి విషయాలనూ సామా న్య లోకోక్తిగా పద్యం ద్వారా వివరించి ‘తస్మాత్‌ జాగ్రత్త:’ అని సూచన చేయుట మానవలోకోపకారమే గదా!
– పి.వి.సీతారామమూర్తి
9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement