Wednesday, May 8, 2024

అన్నమయ్య సంకీర్తనలు

రాగం : మధ్యమావతి
వేదములే నీ నివాసమట

(పెద తిరుమలాచార్య రచన)
వేదములే నీ నివాసమట విమల నారసింహ
నాదప్రియా సకలలోకపతి నమో నమో నరసింహా || వేదములే నీ నివాసమట ||

ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన
నారాయణ రమాధినాయక నగధర నరసింహా
నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు
ఈ రీతి త్రిక్రమాకృతి నేచితి నరసింహ || వేదములే నీ నివాసమట ||

గోవింద గుణగణరహిత కోటి సూర్యతేజ
శ్రీ వల్లభ పురాణపురుష శిఖనఖ నరసింహ
దేవా మిము బ్రహ్మాదులకును తెలియనలవికాదు
భావించగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహ || వేదములే నీ నివాసమట ||

దాసపరికర సులభ తపన చంద్రనేత్ర
వాసవ సురముఖము మునిసేవిత వందిత నరసింహ
భాసురముగ శ్రీ వేంకటగిరిని పాయనిదైవమ వటుగాన
ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహ || వేదములే నీ నివాసమట ||

Advertisement

తాజా వార్తలు

Advertisement