Saturday, May 4, 2024

అన్నమయ్య సంకీర్తనలు

రాగం : ఖరహరప్రియ
సచరా చర మిదే

సచరా చర మిదే సర్వేశ్వరుడే
పచరించి యీతని భావింపు మనసా || సచరా చర మిదే ||

కదలెడి దింతయు కమలా రమణుని
సదరపు సత్యపు చైతన్యమే
నిదిరించెడి యీ నిశ్చేష్ట జగమును
వుదుటున నాతడు వుండే సహజమే || సచరా చర మిదే ||

కలిగి వుండినదే కలదింతయు హరి
నలుగడ పరిపూర్ణపు గుణమే
మలసి లేనిదియు మహిమల నాతని
నిలుకడ గలిగిన నిర్గుణమే || సచరా చర మిదే ||

జీవరాసులకు సృష్టియింతయును
శ్రీ వేంకటేశ్వరు చిత్తంబే
కైవల్య మేలోకపు టిహ పరము
భావింప నేర్చిన పరమ విధులకు || సచరా చర మిదే ||

Advertisement

తాజా వార్తలు

Advertisement