Friday, April 26, 2024

అన్నమయ్య కీర్తనలు : హరియే ఎరుగును

హరియే యెరుగును అందరి బ్రతుకులు
యిరవై యీతని యెరుగుటే మేలు || హరియే ఎరుగును ||

వెనకటిబ్రహ్మలు వేవేలసంఖ్యలు
యెనసి బ్రహ్మాండము లేలిరట
పెనగొని వారల పేరులు మరచిరి
మనుజకీటముల మరెవ్వ డెరుగు || హరియే ఎరుగును ||

ఆసదొల్లి మునులనంత కోట్ల
చేసిరి తపములు సేవలుగా
యేసిరు లందరిరి యెరగ రెవ్వరును
వేసపునరులకు విధి యేదో || హరియే ఎరుగును ||

కల వనేకములు కర్మమార్గములు
పలుదేవత లిటు పాటించిరి
బలిమి శ్రీ వేంకటపతికి మొరయిడి
వెలసిరి తుదనిదె వెర విందరికి || హరియే ఎరుగును ||

Advertisement

తాజా వార్తలు

Advertisement