Tuesday, May 21, 2024

అంతరాత్మ నేతృత్వంలో జీవించాలంటే..

శ్రీఅరవిందుల పూర్వ యోగంలో ఒక ముఖ్య ఘట్టం అహంకారం ఆధారంగా ఇప్పుడు సాగిపోతున్న జీవితం అంతరాత్మ ప్రభావంలో నడబడటం. అంతరాత్మ ప్రభావంలోకి మనం రావాలంటే అందుకు శ్రీ మాత కొన్ని మార్గదర్శక సూత్రాలు చెప్పారు. వాటిని గురిం చి తెలుసుకుందాం.

ఎవరినీ విమర్శించకు
అనేది మనం తప్పక పాటించాలి. మనలో ప్రతి వారూ రోజులో ఎన్నోమార్లు ఏదో రూపంలో ఇతరులను విమర్శి స్తుంటాం. ఏ ఇద్దరూ కలిసిన సరే, ఇది మన చేతనను దిగ జారుస్తుంది. కలుషితం చేస్తుంది. మన చూపును ఎప్పుడూ బాహ్య విషయాల వైపే లాగుతుంది. అది కూడా ఎక్కువ భాగం చెడును చూసేందుకే మొగ్గు చూపుతుంది. అదొక అల వాటుగా స్థిరపడిపోతుంది. ముఖ్యంగా సాధ కులు గుర్తుం చుకోవల్సిన విషయం తనను తాను చూసుకోవడం అవస రం. తనలో సాధనను కుంటుపరిచే విషయాలు లేకుండా ఆత్మ విమర్శ చేసుకోవడం ముఖ్యం. ఇంక ఇతరులను గురిం చి మనసులోగాని, చాటుగా గాని, ఇతరుల వద్ద గానీ, ఎవరి నీ విమర్శించగూడదు. వీలైనంత వరకు మనం అలవాటు చేసుకోవాలి. అవసరమైన విషయాలనే మాట్లాడాలి. మాట లను పొదుపుగా వాడాలి.

ఎవరినీ ఎవరితోనూ పోల్చవద్దు

నిన్ను ఎవరితోనూ పోల్చుకోవద్దు. అలాగే ఇతరులను గూడా ఎవరితోనూ పోల్చగూడదు. ఈ లోకంలో ఎవరి పాత్ర వారిది. ఎవరి పని వారిది. ఎవరి స్థానం వారిది. ఎవరి పని వారిది. నీలోనూ, సర్వంలోనూ, సర్వానికి అతీతం గాను ఉన్న ఆ జగన్మాత శక్తి విన్యాసాలను గమనించగలిగితే మంచిది. ఇది సాధనకు చాలా అవసరం గూడా. ఎవరిని గురించీ ఒక అభిప్రాయానికి రాకు. ఎవరి పనితీరు గురించీ, స్వభావం గురించీ, ఒక అభిప్రాయానికి రాకూడదు. అందరి లోనూ మంచి చెడులు కలబోతగానే ఉంటాయి. ఆయా సందర్భాలలో తన స్వభావానుసారం ప్రతిస్పందించడం జరుగుతోంది. ఏదో ఒక సందర్భంలోని ప్రతిస్పందనను ఆధారం చేసుకుని ఇంక ఆ మనిషి జీవితం యావత్తు అలాగే అనుకొని ఇక అభిప్రాయానికి రాకూడదు. నీకు ఆసక్తి ఉంటే, నీ మాటకు విలువను ఇస్తారనుకుంటే అవతలి వారు నొచ్చు కొనకుండా ప్రియంగా నీకు తెలిసిన రెండు మంచి మాటలు చెప్పు.

జీవితానికి ఒక లక్ష్యం అనేది ఉండాలి

- Advertisement -

లక్ష్యం లేని జీవితం నిరర్థక జీవితం. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీ జీవితం కూడా అంత విలువగలది అవుతుంది. ఆ ఉన్నత లక్ష్యం యొక్క పరిధిలోనే నీ జీవితం అల్లుకుపోయి ఉండాలి. నీవు ఏమి చేసినా, ఏమి మాట్లాడినా, ఏమి ఆలోచించినా అంతా ఆ లక్ష్యాన్ని చేరుకొనేదే అయి ఉండాలి. నీ లక్ష్యం దివ్య జీవి తమే. అయితే అంతకన్నా కావ లసింది ఇంకేముంటుంది? నీ మన: ప్రాణ శరీరాదులలోని స్పం దనలన్నీ ఆ ల క్ష్యం దిశగానే ఉం డాలి. దానిని చేరుకోవడంలో అవరోధాలు, ఆటంకాలు కలిగిం చేది ఏదీ ఉండకుండా జాగ్రత్త పడాలి. నీ చేతన యావత్తూ ఆ దిశగానే ఉండాలి.

ఒక్క క్షణం వెనక్కు చూడు

మన మనస్సులో అనేక ఆలోచనలు వస్తుంటాయి. అది సహజం. మనం ఆ ఆలోచనలలో పడి కొట్టుకుపోకూ డదు. వాటి నుండి వెనుకకు తగ్గి సాక్షిభూతంగా చూడాలి. ఏమాత్రం ప్రతిస్పందన ఉండకూడదు. నీ అలవాట్లు నిన్ను ఆయా సందర్బాలలో ఆవేశానికి లోను చేస్తాయి. ఆయా సమయాలలో ఒక్క క్షణం వెనక్కు తగ్గు. తగ్గ డం అలవాటు చేసుకొంటే ఆ ఆలోచనలు క్రమంగా అదృశ్య మౌతాయి. మనస్సు నిశ్చల నీరవతా స్థితిని అందుకుం టుంది. అహంకారానికి కాలం చెల్లిపోతుంది. అహంకారం పనిచేయడం ఆగిపోయినప్పుడు అంతరాత్మముందుకు వచ్చి జీవ నరమేధానికి సారథ్యం వహిస్తుంది. నీ చేతన, ఇతరుల చేతనతో అల్లుకుపోతుంది. అందరి ఆలోచనా తీరు లు నీకు అవగతం అవుతాయి. ఈ స్థితిని తప్పకుండా సాధించి తీరాలి. ఆనందం కోసం ఏ పనీ చేయకూడదు. చేస్తున్న పనిని అంటే విధి నిర్వహణను విడిచి పెట్టకూడదు. చేస్తున్న పని లోనే ఆనందం అనుభవించాలి. ఆ పని ద్వారా ఉన్నత చేతన ను అందుకోవాలి. రాజ్యాలను పాలించడం గొప్ప పని అనీ, చెప్పులు కుట్టడం, పాత్రలు శుద్ధి చేయడం, బట్టలు శుభ్రం చేయడం చిన్న పనికాదు. ఏ పనినైనా సమంగా చూడగల గాలి. ‘సమత్వ యోగ ఉచ్యతే’ అని గదా గీతాచార్యుడు చెప్పింది. అందుకే ఏమి చేస్తున్నావనేది ముఖ్యంకాదు. ఏ భావంతో చేస్తున్నావనేది ముఖ్యం. మన జీవితానికి అంతరాత్మ. సారధ్యం వహించాలంటే వీటన్నింటినీ పాటించి తీరాలి. శ్రీమాత చెప్పిన మార్గదర్శ కాలలో ఇవి కొన్ని మాత్రమే.
– కవితా శ్రీధర్‌ , 93955 11193

Advertisement

తాజా వార్తలు

Advertisement