Sunday, November 10, 2024

Arjun kapoor : బాలీవుడ్ లో దారుణం..తొలిరోజు కలెక్ష‌న్ కేవ‌లం రూ .36వేలే

ఈ మధ్య కాలంలో ఎంత చిన్న సినిమా అయినా కూడా దాని ఫలితాన్ని బట్టి పదుల కోట్ల నుంచి వంద కోట్ల వరకు వసూళ్లు రాబడుతూనే ఉంది. సౌత్ లో చిన్న సినిమాలు కూడా వందల కోట్ల వసూళ్లు సాధించిన దాఖలాలు ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా ఒకప్పుడు మినిమం వసూళ్లు కోట్లలోనే ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

తాజాగా వచ్చిన ది లేడీ కిల్లర్ సినిమా కి వచ్చిన వసూళ్లు మొత్తం బాలీవుడ్ పరువు తీసే విధంగా ఉన్నాయి. మొన్న శుక్రవారం విడుదల అయిన ది లేడీ కిల్లర్ సినిమాలో ప్రముక బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్ నటించాడు. ఆయనకు జోడీగా భూమి పెడ్నేకర్ నటించింది. అజయ్ బహ్ల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ది లేడీ కిల్లర్ సినిమా మొదటి రోజు కేవలం రూ.38 వేల రూపాయల వసూళ్లు నమోదు చేసింది. దేశం మొత్తం కూడా ఈ సినిమాకి గాను మొదటి రోజు 300 లోపు టికెట్లు తెగినట్లు స‌మాచారం. కపూర్‌ ఫ్యామిలీకి చెందిన హీరో సినిమాకు ఇంత దారుణమైన నెంబర్స్ నమోదు అవ్వడం విచిత్రం. కపూర్‌ ఫ్యామిలీ పరువు తీశారు అంటూ ది లేడీ కిల్లర్ టీం మెంబర్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తొలిరోజు త‌ర్వాత ఈ మూవీని థియేట‌ర్స్ ను తీసేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement