Tuesday, April 30, 2024

LEO | అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘లియో’ – కారణం అదేనా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో. లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. మూవీకి తొలి రోజు నుంచి మిక్స్ టాక్ వచ్చినా కలెక్షన్స్ లో మాత్రం దుమ్మురేపింది. కాగా, ఈ మూవీ అనుకున్న స‌మ‌యంకంటే ముందుగానే ఓటీటీ ఎంట్రీ ఇవ్వ‌నుంది.

ఈ మూవీని నవంబర్ 21న ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఈ మూవీ ఆన్‌లైన్​లో లీక్ అయ్యింది. దీంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్​ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అనుకున్న దానికంటే ముందుగానే ఈ మూవీని స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిస్తోంది. అయితే దీనిపై అటు లియో మేకర్స్ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement