Monday, April 29, 2024

Leak | ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్.. లీగల్ యాక్షన్ తీసుకున్న మూవీ యూనిట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న 50వ సినిమా కావడంతో ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని నిర్మిస్తున్నారు. దీంతో ఈ మూవీ నిర్మాణ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే, స్టార్ హీరో సినిమా కావ‌డంతో, అభిమానులు ప్రేక్ష‌కులు తమ హీరో నటిస్తున్న సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ న్యూస్ వినాలని, చూడాలని అనుకుంటారు.. అలాంటి వారి కోసం కొందరు లీక్ రాయుళ్లు స్టార్ సినిమాల నుంచి ఫోటోలు, సాంగ్ బిట్స్ లీక్ చేస్తుంటారు.

అలా లీకైన వాటిని సోషల్ మీడియాలో వైరల్ అవ్వకుండా తగిన చర్యలు తీసుకుంటుంది ‘‘గేమ్ ఛేంజ‌ర్’’ చిత్ర యూనిట్. ఇటీవల మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కి ముందే ఎవరో లీక్ చేసేశారు. దీనిని సీరియస్ గా తీసుకున్న దిల్ రాజు.. లీగల్ గా యాక్షన్ తీసుకున్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ సాంగ్ లీక్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ లీక్ విషయంలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలియజేశారు. వారిని అదుపులోకి తీసుకోని పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్లు తెలియజేశారు.

ఇక ఈ ‘జరగండి’ సాంగ్ ని అఫీషియల్ గా దీపావళి నాడు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. లీకైన పాటకి ఆడియన్స్ నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. దీంతో ఒరిజినల్ సాంగ్ పై భారీ హైప్ నెలకుంది. రిలీజ్ తరువాత యూట్యూబ్ రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం అంటున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ పాటకి ప్రభుదేవ డాన్స్ కోరియోగ్రఫీ చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement