Wednesday, May 1, 2024

అమెజాన్ ప్రైమ్ లో ‘‘రావణాసుర’’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే

మాస్ మాహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నప్పటికీ మూవీపై మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. విడుదలైన మొదటి వారంలో ఓ మాదిరి వసూళ్లతో ఫర్వాలేదనిపించినప్పటికీ.. రెండో వారానికి వచ్చేసరికి కలెక్షన్లు బాగా దిగజారాయి. కాగా, త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.

ఈ సిినమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో మంచి ధరకు సొంతం చేసుకుంది. అయితే, సినిమా రిలీజ్ అయిన ఆరు వారాల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించారు మేకర్స్. కానీ, మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. దీని ప్రకారం, మే మొదటి వారంలోనే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement