Thursday, May 2, 2024

వాట్ యే లుక్.. వైర‌ల్ గా మ‌హేశ్ బాబు పిక్స్

వ‌య‌సు పెరిగే కొల‌ది అందం త‌రుగుతుంది.కానీ రోజుకురోజుకు మరింత అందంగా తయారవుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్ బాబు. ఇటీవల ఆయన పిక్స్ చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. మహేశ్ బాబు సహజంగానే అందగాడు… ఇప్పుడు ఇంకాస్త సన్నబడడంతో ఆ అందం రెట్టింపైంది. తాజాగా ‘బీటీఎస్’ అంటూ మహేశ్ బాబు తన తాజా స్టిల్స్ ను పంచుకున్నారు. మునుపటి కంటే ఇంకా ఆకర్షణీయంగా, వెరీ షార్ప్ లుక్ తో కనిపిస్తున్న జీరో ఫ్యాట్ మహేశ్ ను ఈ ఫొటోల్లో చూడొచ్చు. ఇక ఈ లేటెస్ట్ స్టిల్స్ పై అభిమానుల స్పందన అంతాఇంతా కాదు. తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో వెల్లువలా కురిపిస్తున్నారు. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కాగా మ‌హేశ్ బాబు ఫొటోస్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement