Sunday, May 5, 2024

Vivekam : వివేకం మూవీ… హైకోర్టును ఆశ్ర‌యించిన ద‌స్త‌గిరి

వైఎస్ వివేకానందరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కించిన వివేకం చిత్రం యూట్యూబ్ లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తొలిరోజులోనే 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించి సత్తా చాటింది. ఈ చిత్రంపై వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు.

- Advertisement -

తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉండటంపై హైకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసు సీబీఐ కోర్టులో ఉన్న నేపథ్యంలో, సినిమా ప్రదర్శనను ఆపేయాలని కోర్టును కోరారు. టీడీపీ డిజిటల్ విభాగం ఐటీడీపీ ప్రోత్సాహంతో ఈ సినిమా అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ఈ సినిమాను ప్రదర్శిస్తోందని తెలిపారు. ఈ పిటిషన్ పై ఇవాళ‌ వాదనలు జరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement