Friday, April 26, 2024

విశ్వ‌క్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫ‌స్ట్ గ్లింప్స్ అదిరింది..

YouTube video

విశ్వక్ సేన్ తాజా గా న‌టిస్తున్న మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ . ఈ మూవీతో లిరిక్ రైటర్ కృష్ణచైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. . ఫస్టు గ్లింప్స్ చూస్తుంటే, గోదావరి కేంద్రంగా సాగే ఇసుక మాఫియా చుట్టూ ఈ కథ నడవనుందని తెలుస్తోంది.

“అన్నా మేము గోదారోళ్లం .. మాట ఒకటే సాగదీస్తాం .. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం’ అంటూ విశ్వ‌క్ చెప్పిన డైలాగ్ తో ఈ గ్లింప్స్ ఆక‌ట్టుకుంటుంది.. కథానాయికగా నేహా శెట్టి నటిస్తుండ‌గా, ఈ సినిమాలో, ఇతర ముఖ్యమైన పాత్రలలో నాజర్ ,సాయికుమార్,గోపరాజు రమణ కనిపించ‌నున్నారు.. అంజలి ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించింది. నాగవంశీ – సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీత ద‌ర్శ‌కుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement