Sunday, April 28, 2024

Vishwak Sen : మాస్ కా దాస్ కొత్త మూవీ లైలా…

టాలీవుడ్ లో వరుస చిత్రాలతో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ దూసుకెళ్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. హీరోగానే కాకుండా దర్శక, నిర్మాణ, రచన బాధ్యతలు నిర్వర్తిస్తూ మల్టీ టాలెంటెడ్ గా రానిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తెలుగు యంగ్ హీరోల్లో విశ్వక్ క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ బెస్ట్ పొజిషన్ కు చేరుకోవడంలో సక్సెస్ అవుతున్నారు.

- Advertisement -

ఇటీవల గామితో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్న విశ్వక్.. త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సందడి చేయనున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. వేసవి కానుకగా మే17వ తేదీన విడుదల కానుం .. VS 12 కోసం విశ్వక్ సేన్.. దర్శకుడు రామ్ నారాయణ్ తో చేతులు కలిపారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్.. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని రోల్ లో కనిపించనున్నారు. మాస్ కా దాస్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు మేకర్స్.

విశ్వక్ కు బర్త్ డే విషెస్ చెబుతూ టైటిల్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇవి సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. రెండింట్లో పూలు, సీతాకోక చిలుకలు, అద్దం, కొవ్వొత్తి, మేకప్ కిట్, రేడియో, చార్మినార్, తుపాకీ, నెత్తురోడుతున్న కత్తి మొదలైనవి ఉన్నాయి. సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే విశ్వక్ పలుమార్లు చెప్పినట్లు.. ఈ మూవీ టైటిల్ ను లైలాగా ఖరారు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement