Thursday, April 25, 2024

విశాల్ కొత్త సినిమా స్టార్ట్

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తమిళ్ లో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. అక్కడ విశాల్ చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ గా తెలుగులో కూడా విడుదల అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు విశాల్ తన 31 వ సినిమాను స్టార్ట్ చేశాడు.

ఇటీవల చక్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ ఈ సారి సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు తుపాశరవణ తెరకెక్కుతున్న ఈ సినిమా ముహూర్తం తో ఈరోజు లాంచ్ చేశారు. ఈ చిత్రానికి యంగ్ బ్యూటీ డింపుల్ హయతిని హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. మరోవైపు విశాల నిర్మాణ సంస్థలలోనే ఈ సినిమాలోనే నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement