Wednesday, April 24, 2024

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోను కంప్లీట్ లాక్‌డౌన్‌

క‌రోనా వైర‌స్ ఉధృతి నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆయా రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించుకున్నాయి. ఆ రాష్ర్టాల జాబితాలో తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేరింది. క‌రోనా వైర‌స్‌ను అరిక‌ట్టే చ‌ర్య‌ల్లో భాగంగా మే 15వ తేదీ వ‌ర‌కు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తున్న‌ట్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ ప్ర‌క‌టించారు. క‌రోనా పాజిటివిటీ రేటు 18 శాతం ఉన్నందునే లాక్‌డౌన్ అమ‌లుకు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు, నిత్యావ‌స‌రాల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం తేల్చిచెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement