Tuesday, October 8, 2024

విరూపాక్ష అరుదైన ఘ‌న‌త‌.. రూ.100కోట్ల క్ల‌బ్ లో సాయిధ‌ర‌మ్ మూవీ

అరుదైన ఘ‌న‌త‌ని సాధించింది విరూపాక్ష చిత్రం.. విరూపాక్ష మూవీ వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు తొలి వంద కోట్ల సినిమా ఇదే కావడం విశేషం. ఈ మేరకు మేకర్స్‌ ఓ స్పెషల్‌ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. తెలుగుతో పాటు ఇటీవలే హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై అక్కడ కూడా మంచి కలెక్షన్‌లు రాబడుతుంది విరూపాక్ష‌మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి తేజ్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. ఇక దర్శకుడిగా కార్తిక్‌ దండూ తొలి ప్రయత్నంలోనే మంచి విజయం సాధించాడు. తొలి సినిమాకే ఈ రేంజ్‌లో అవుట్‌ పుట్‌ ఇచ్చాడంటే మాములు విషయం కాదు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇక మే 21 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. విరూపాక్ష తో తిరుగులేని కంబ్యాక్‌ ఇచ్చాడు. నాలుగు వారాల క్రితం రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్‌లు స్టడీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత విడుదలైన సినిమాలన్నీ బ్యాక్‌ టు బ్యాక్‌ పెవిలీయన్‌ బాట పట్టడంతో ప్రేక్షకులకు మరో ఆప్షన్ కూడా లేక రీపీట్‌ షోలు వేశారు. పైగా చాలా కాలం తర్వాత మంచి థ్రిల్లర్‌ మూవీ రావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ కూడా బాగా సపోర్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement