Tuesday, October 8, 2024

హృద‌యాల‌ని తాకుతోన్న.. విమానం ట్రైల‌ర్

విమానం మూవీ ట్రైల‌ర్ హృద‌యాల‌ని తాకుతోంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి విమానం చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను జూన్ 1న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ విడుద‌ల చేసి ..చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. శివప్ర‌సాద్ యానాల మాట్లాడుతూ ప్రతీ ఒక్క‌రి జీవితాల్లో బ‌ల‌మైన భావోద్వేగాలుంటాయి. అలాంటి ఎమోష‌న్స్‌ను బేస్ చేసుకునే ‘విమానం’ సినిమాను రూపొందించాం. జూన్ 9న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుద‌న్నారు. అవిటిత‌నంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ కొడుకు కోరిక‌ను తీర్చాల‌నుకుని రాత్రి .. ప‌గ‌లు క‌ష్ట‌ప‌డుతుంటాడు ఓ తండ్రి. విమానం ఎక్కాల‌నుకునే కొడుకు కోరిక‌ను తీర్చటానికి ఏం చేయాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇది తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే ఎమోష‌న్‌.సుమ‌తి అనే అమ్మాయిని ప్రేమించే కోటి అనే యువకుడు .. లోక‌మంతా త‌న‌ను కామంతోనే చూస్తుంద‌ని భావించే ఆమెకు త‌నను మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడ‌ని తెలియ‌గానే ఆమె హృద‌యంలో నుంచి వచ్చే ఆవేద‌న‌.. ఇది రెండు హృద‌యాల మ‌ధ్య ఉండే ఎమోష‌న్‌. హృద‌యాన్ని తాకే ఇలాంటి భావోద్వేగాల వ్య‌క్తుల ప్ర‌యాణాన్ని తెలియ‌జేసే చిత్ర‌మే విమానం క‌థ‌.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement