Tuesday, May 7, 2024

పాన్ ఇండియా మూవీగా విక్రాంత్ రోనా.. ఈ నెల 23న ట్రైల‌ర్ రిలీజ్‌

క‌న్న‌డ హీరో సుదీప్ కిచ్చా తాజాగా రెండు సినిమ‌ల‌ను సెట్స్‌పై ఉంచారు… అందులో ‘విక్రాంత్ రోనా’ ఒక‌టి. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన ఈ సినిమాకి అనుప్ భందారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. షాలిని ఆర్ట్స్‌, ఇన్‌వేనియో ఫిలింస్ ఇండియా సంస్థల‌తో క‌లిసి సుదీప్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమాని తెర‌కెక్కించాడు.

‘ఈగ’ సినిమాతో తెలుగులో విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకున్నాడు సుదీప్. ఆ త‌రువాత వ‌రుస‌గా ‘బాహుబ‌లి’, ‘సైరా’ వంటి పాన్ ఇండియా సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత‌ ద‌గ్గ‌ర‌య్యాడు. అయితే ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. కాగా ఇటీవ‌లే మేక‌ర్స్ ఈ మూవీని జూలై 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ క్ర‌మంలో తాజాగా మేక‌ర్స్ ట్రైల‌ర్ డేట్‌ను ప్ర‌క‌టించారు. ‘విక్రాంత్ రోనా’ ట్రైల‌ర్‌ను జూన్ 23న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ చిత్రం క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల కానుంది. అంజీష్ లోక‌నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి విలియ‌మ్ డేవిడ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement