Thursday, May 2, 2024

విజయ రాఘవన్ పొలిటికల్ డ్రామా @ ట్రైలర్ రిలీజ్

బిచ్చగాడు సినిమా తో తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందారు విజయ్ ఆంటోని. వీటితోపాటు బేతాలుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్ వంటి చిత్రాలలో కూడా నటించాడు విజయ్. అయితే ప్రస్తుతం విజయ్ ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ రాఘవన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను సోమవారం టాలీవుడ్ హల్క్ రానా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

రాజకీయ నాయకుల ప్రవర్తన, ప్రస్తుతం పార్టీల తీరు పై ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఓ సాధారణ టీచర్ రాజకీయ నేతగా…మారి ప్రస్తుత పొలిటికల్ వ్యవస్థను ఏ విధంగా మార్చాడు అనేది ఆనంద కృష్ణన్ ఈ సినిమాల్లో చూపించినట్లు తెలుస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement