Saturday, May 4, 2024

ది ఫ్యామిలీ మాన్ 3 లో విజయ్ సేతుపతి ?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో సౌత్ లో నెంబర్ వన్ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఇదిలా ఉండగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. అయితే విడుదలకు ముందు వివాదాస్పదమైన ఈ సిరీస్ రిలీజ్ తర్వాత ప్రశంసలను అందుకుంది. అయితే ఈ సిరీస్ కు సంబంధించి సీక్వెల్ ది ఫ్యామిలీ మాన్3 కోసం విజయ్ సేతుపతి తో దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మొదట ది ఫ్యామిలీ మాన్ 2 ఎల్‌టిటిఇ చీఫ్ పాత్ర కోసం విజయ్ ని అడిగారట మేకర్స్. కానీ కొన్ని కారణాల వల్ల విజయ్ సేతుపతి ఈ పాత్రను అంగీకరించలేదట. ఇక తాజా సమాచారం ప్రకారం ది ఫ్యామిలీ మాన్ 3 లో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఇప్పటికే ఆయనతో చర్చలు కూడా జరిగాయని అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా విజయ్ సేతుపతి ఇచ్చాడని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement