Wednesday, May 1, 2024

రాక్షసుడు2 లో విజయ్ సేతుపతి ?

రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రాక్షసుడు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించడంతోపాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా రాక్షసుడు2 తెరకెక్కబోతుంది. ఈ మేర అధికారికంగా ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటన కూడా చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాలో ఓ స్టార్ హీరోగా కనిపించబోతున్నాడని ప్రకటించారు.

కాగా ఆ హీరో ఎవరు అన్నదానిపై సోషల్ మీడియా లో చర్చలు మొదలైపోయాయి. ముఖ్యంగా రాక్షసుడు2 లో నటించబోయే స్టార్ విజయ్ సేతుపతి అని తెలుస్తోంది. విజయ్ సేతుపతి కి స్క్రిప్ట్ బాగా నచ్చిందట. అయితే ఇంకా ఓకే చేయలేదట. కానీ డేట్స్ ఎడ్జస్ట్ మెంట్ ను బట్టి సినిమా ఓకే చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ విజయ్ సేతుపతి ఈ సినిమా చేస్తే భారీ హైప్ క్రియేట్ అవుతుందనడంలో సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement