Friday, April 26, 2024

విజయ్ దళపతి@65 టైటిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది !!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ దళపతి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దళపతి సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

కాగా విజయ్ కెరీర్లో 65వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సంబంధించి టైం ను చిత్రయూనిట్ ఫిక్స్ చేసింది. మొదట జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ ట్రీట్ ఉంటుందని అందరూ భావించారు. కానీ జూన్ 21 సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి ఫస్ట్ లుక్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement