Tuesday, May 30, 2023

వజ్రాల వ్యాపారి ఇంటికే కన్నం.. రూ.40 లక్షలు విలువైన వజ్రాలు చోరీ

హైదరాబాద్: నాగోల్‌ డివిజన్‌ మధురానగర్‌లోని ఓ వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు రూ. 40 లక్షల విలువైన వజ్రాలను, జాతిరత్నాలను దొంగలు అపహరించారని శుక్రవారం బాధితుడు ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్‌ టీం అన్ని ఆధారాలు సేకరించి ఈ నెల 15న చోరీ జరిగినట్లు గుర్తించారు. మధురానగర్‌కు చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి నగరంలో 3 చోట్ల వజ్రాలు, జాతిరత్నాల విక్రయ దుకాణాలు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 10న ముంబై నుంచి రూ. 1.2 కోట్ల విలువైన వజ్రాలు, జాతిరత్రాలు తీసుకువచ్చినట్లు మురళీకృష్ణ పోలీసులకు ఇచ్చి ఫిర్యాదులో పేర్కొన్నాడు. చోరీకి పాల్పడినది ఎవరన్న దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement