Thursday, April 25, 2024

విజయ్ బర్త్ డే స్పెషల్….65 గెటప్స్ తో పోస్టర్

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి కొత్తగా సినీ అభిమానులకు పరిచయం చేయనవసరం లేదు. విజయ్ కు ఒక్క తమిళనాట కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే మిశ్రమ స్పందన వచ్చినా సరే భారీ స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తూ ఉంటాడు. అయితే అలాంటి ఈ స్టార్ హీరో పుట్టిన రోజున మరో రెండు రోజుల్లో రాబోతోంది. ఈ నేపథ్యంలోనే అభిమానులు సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ చేశారు. కామన్ డిపి మొదలుకొని ఫ్యాన్ మేడ్ పోస్టర్ల వరకు ట్వీట్ లతో ట్రెండ్ చేస్తున్నారు. కాగా సెవెన్ స్క్రీన్ స్టూడియో వారు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో విజయ్ ఇప్పటి వరకు నటించిన 64 సినిమాలకు సంబంధించిన లుక్ లతోపాటు 65వ సినిమా లుక్ ను కూడా రిలీజ్ చేశారు. సినిమా సినిమాకు అభిమానుల సంఖ్య పెంచుకుంటూ సౌత్ లో స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు విజయ్. ప్రస్తుతం విజయ్ పుట్టినరోజు సందర్భంగా సెవెన్ స్క్రీన్ స్టూడియో వారు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement