Wednesday, April 24, 2024

థియేటర్‌లోకి రానున్న ‘పాగల్’

తెలంగాణలో క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్ ను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ఇక, ఏపీలో కర్ఫ్యూను సడలించారు. దీంతో త్వరలో సినిమా థియేటర్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. దీంతో ఇప్పటి వరకు రిలీజ్ వాయిదా పడిన సినిమాలు విడుదలకు మళ్లీ క్యూ కడుతున్నాయి. తొలుత యంగ్ హీరో విశ్వక్ సేన్ పాగల్ మూవీతో థియేటర్లో సందడి చేయనున్నారు.

‘హిట్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టేసిన విశ్వక్ సేన్.. ‘పాగల్’ మూవీని సిద్దం చేశాడు. కరోనా, లాక్ డౌన్ కారణంగా గతంలో ఈ మూవీ వాయిదా పడింది. థియేటర్లు మూత పడడంతో పాగల్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని ప్రచారం జరిగింది. అయితే, మూవీ యూనిట్ దీనిని ఖండించింది. థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఇప్పుడు సినిమా థియేటర్లు తెరుచుకోన్న నేపథ్యంలో రెడీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విశ్వక్ సేన్ సరసన సిమ్రన్ చౌదరి, నివేదా పేతురాజ్ జోడి కట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement