Sunday, May 5, 2024

‘విడుతలై’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన మేకర్స్

తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘విడుతలై (పార్ట్ 1)’. సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ విమర్శకులు, ప్రేక్షకుల నుండి మంచి సమీక్షలను అందుకుంది. ఈ సినిమా పోలీసు థ్రిల్లర్ గా తెరకెక్కింది. కాగా, సినిమాని తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రిలీజ్ చేయనున్నట్లు సినీ నిర్మాతలు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

కాగా, ఈ మూవీ సంబంధించిన తెలుగు టైటిల్, విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. తెలుగులో ‘విడుదల పార్ట్ 1’ పేరుతో ఏప్రిల్ 15న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఆదరణ లభిస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఇక, విజయ్ సేతుపతి, సూరిని బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన పురాణ ఇళయరాజా, మరోసారి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement