Monday, April 29, 2024

విడుద‌ల మేకింగ్ వీడియో.. ఎంత క‌ష్ట‌ప‌డ్డారో

సినిమా షూటింగ్ అంటే అంత ఈజీ కాదు..ఎన్నో క‌ష్ట న‌ష్టాల‌కి ఓర్చాలి. ఎండ‌..చ‌లిలో షూటింగ్ చేయ‌డం అంటే మాట‌లు కాదు. కాగా విడుద‌ల మూవీ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమా ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. కాగా దట్టమైన అడవిలో .. గిరిజన గూడెంలోని ఇరుకైన సందుల్లో .. ఎత్తైన కొండలపై చిత్రీకరణ ఎలా సాగిందనేది చూపించారు. స్కెటింగ్ చేస్తూ కెమెరాతో షూట్ చేయడం .. రోప్ సాయంతో చిత్రీకరించడం .. చెట్లపై లైట్స్ ను సెట్ చేయడం కోసం ఎంత కష్టపడింది చూపించారు. రోప్ ఉన్నప్పటికీ సూరి గాయపడటం ఈ వీడియోలో మనకి కనిపిస్తుంది. ఇటీవల తమిళంలో థియేటర్లకు వచ్చిన ‘విడుదలై’ అక్కడ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అక్రమార్కులను నిలదీసే దళ నాయకుడిగా విజయ్ సేతుపతి .. సాధారణమైన పోలీస్ గా సూరి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఫారెస్టు నేపథ్యంలో సాగే ఈ సినిమాకి వెట్రి మారన్ దర్శకుడు. తమిళంలో వెట్రి మారన్ సినిమాలను ఇష్టపడేవారు ఎక్కువగా కనిపిస్తారు. కథను బట్టి .. పాత్రలను బట్టి ఆర్టిస్టులను ఎంచుకోవటం వెట్రి మారన్ ప్రత్యేకత. అందువలన ఆయన సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అలా రూపొందిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు అల్లు అరవింద్ తీసుకొస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement