Wednesday, May 8, 2024

‘ఇందువదన’ ఫస్ట్ లుక్ అదిరిపోయింది..!!

వరుణ్ సందేశ్ ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా తెలుసు. అయితే హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం వంటి హిట్ సినిమాల తర్వాత సరైన హిట్ ఒక్కటి కూడా దొరకలేదు వరుణ్ కు. ప్రస్తుతం ఎమ్.ఎస్.ఆర్ దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ఇందువదన సినిమాలో వరుణ్ సందేశ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఫర్నాజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కథ స్క్రీన్ప్లే మాటలు సతీష్ ఆకెటి అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను సోమవారం ఉదయం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ లుక్ లో షర్టు లేకుండా వరుణ్ సందేశ్, తక్కువ దుస్తులతో హీరోయిన్ ఫర్నాజ్ ఒకరిని ఒకరు కౌగలించుకుని కనిపించారు.

విశేషం ఏమిటంటే ఈ పోస్టర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement