Sunday, April 28, 2024

ఎన్టీఆర్ తో ఒక్క షాట్ నటిస్తే చాలు….వనిత విజయ్ కుమార్

యంగ్ టైగర్ ఎన్టీఆర్… గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఇక ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ అయితే మామూలుగా ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఎన్టీఆర్ నటనకు ఫిదా అవుతూ ఉంటారు. అయితే సామాన్యులే కాకుండా సినీ స్టార్స్ సైతం ఎన్టీఆర్ అంటే పడి చచ్చిపోతారు. మొన్నటికి మొన్న ఖుష్బూ.. ఎన్టీఆర్ తనకు ఇష్టమైన హీరో అని చెప్పుకొచ్చారు.

అలాగే నటి అర్చన కూడా ఎన్టీఆర్ అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. తాజాగా నటి వనిత విజయ్ కుమార్ ఎన్టీఆర్ పై అభిమానాన్ని వ్యక్తం చేశారు. లేటెస్ట్ గా ఓ షో లో పాల్గొన్నారు వనిత విజయ్ కుమార్. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయింది. అయితే అందులో నాగార్జున కి నేను పెద్ద ఫ్యాన్ అని కానీ….ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎన్టీఆర్ కు చాలా పెద్ద అభిమానిని అని ఒక్క షాట్ లో అయినా ఎన్టీఆర్ తో నటిస్తే చాలు అని అదే తన పెద్ద డ్రీమ్ అని చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement