Thursday, May 2, 2024

చిరంజీవి ముందుకు రావాలి: వల్లభనేని అనిల్

‘మా’ అసోసియేషన్ శాశ్వత భవన నిర్మాణంపైనే మరోసారి చర్చకు వచ్చింది. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఓ సలహా ఇచ్చారు. ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలోని స్థలాన్ని అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఉపయోగించుకోవాలని చెప్పారు. ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో రామానాయుడు కల్యాణమండపం ముందు ఉన్న స్థలంలో అద్భుతమైన బిల్డింగ్ కట్టుకోవచ్చని… ఆ బిల్డింగ్ లో ‘మా’ అసోసియేషన్ కార్యాలయంతో పాటు, 24 క్రాఫ్టుల కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. దీనివల్ల సినీ పరిశ్రమ మొత్తం ఒకే చోట ఉండేందుకు వీలవుతుందని చెప్పారు. దీనికోసం అగ్ర హీరోలు, పరిశ్రమ పెద్దలు అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లాంటి చిరంజీవి ముందుకు రావాలని కోరారు.

కాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోండుతోంది. దీంతో అధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్న వారు మా ఎన్నికల భవనం గురించే ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వల్లభ నేని అనిల్ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంచరించుకుంది.

ఇది కూడా చదవండి: కేంద్రం అలా చేస్తే పెట్రోల్ రూ.32 కే వస్తుందట..

Advertisement

తాజా వార్తలు

Advertisement