Saturday, May 4, 2024

ఉస్తాద్ టీజ‌ర్ రిలీజ్ చేసిన రానా.. పైలెట్ గా సింహా కోడూరి

ఫ‌ణిదీప్ తెరకెక్కిస్తున్న చిత్రం ఉస్తాద్. ఈ చిత్రంలో హీరోగా సింహాకోడూరి న‌టించారు. వారాహి బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కావ్య కల్యాణ్ రామ్ నటించింది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి హీరో రానా చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. హీరోకి చిన్నప్పటి నుంచి విమానాలు అంటే ఇష్టం. ఆకాశంలో ఎగురుతున్న విమానాలను ఆశగా అలా చూస్తుండి పోతుంటాడు. టీనేజ్ లోకి అడుగుపెట్టిన తరువాత అతనికి పైలెట్ కావాలని ఉంటుంది. కానీ పై నుంచి చూస్తే కళ్లు తిరిగే బలహీనత ఆయనకి ఉంటుంది. తన ఆర్ధిక పరిస్థితికి తగినట్టుగా ఎప్పుడు చూసినా ఆయన పాత బైక్ పై తిరుగుతూ ఉంటాడు. అలాంటి అతను తన ఆర్ధిక ఇబ్బందులను .. భయాలను .. బలహీనతలను అధిగమించి తన కలను ఎలా నిజం చేసుకున్నాడు? అనేదే కథ. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.మ‌రి ఈ చిత్రం సింహా కోడూరికి ఏ మాత్రం విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement