Friday, June 14, 2024

లీకేజీ లో నా పాత్ర లేదు – ప్రశాంత్

టెన్త్ పేపర్ లీకేజీ నిందుతుడు ప్రశాంత్ కరీంనగర్ జైలు నుండి బుధవారం విడుదలయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..త‌న పై కావాలనే పోలీసులు అక్రమ కేసులు పెట్టారని అన్నారు. పేపర్ లీకేజీ లో త‌న పాత్ర లేదన్నారు. జర్నలిస్ట్ పాత్ర పోషించానని, 140 ఫోన్స్ మాట్లాడినట్లు అవాస్తవమ‌న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కొంత సమాచారం తయారు చేసి ఇచ్చానని అన్నారు త‌న అరెస్ట్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం పాత్ర ఉందన్నారు. త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. పేపర్ లీకేజీ కేసులో ఏ 2 ముద్దాయి ప్రశాంత్ తో పాటు మరో ఇద్దరు కరీంనగర్ జైల్ నుండి విడుదలయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement