Tuesday, April 30, 2024

ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది.. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ఫ‌స్ట్ గ్లింప్స్

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ .. పత్తర్ గంజ్ .. పాతబస్తీకి చెందిన పోలీస్ ఆఫీసర్ గా ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ల్యాణ్ ఈ సినిమాలో కనిపించనున్నాడనే విషయం ఈ గ్లింప్స్ వలన తెలుస్తోంది. 42 సెకన్ల నిడివిలోనే పోలీస్ ఆఫీసర్ గా పవన్ తన మార్క్ .. తన స్టైల్ చూపించాడు.దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. శ్రీలీల గ్లామర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనుంది. ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుందని పవన్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం విశేషం. హరీశ్ శంకర్ కి మాస్ పల్స్ బాగా తెలుసు. ఇక పవన్ కల్యాణ్ కి గల మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement