Friday, May 17, 2024

బాల‌కృష్ణ సినిమాలో అర్జున్ రాంపాల్ …

నందమూరి బాలకృష్ణ, అనిల్‌ రావి పూడి కాంబినేషన్‌ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇది బాలకృష్ణకు 108వ సినిమా. యాక్షన్‌ ఎం టర్‌ టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. పలువురు ప్ర ముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించను న్నా రు. ఈ సినిమాను షైన్‌ #స్క్రన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు.

కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తు న్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించ నుంది. ఇప్పుడు ఓ పవర్‌ ఫుల్‌ పాత్ర కోసం బాలీ వుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ తెరపైకి వచ్చా రు. ప్రకటన వీడియోలో అర్జున్‌ రాంపాల్‌, బాలకృష్ణ లెజెండ్‌ చిత్రంలోని ‘ఫ్లూ టు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’ అనే పాపులర్‌ డైలాగ్‌ చెప్పారు. ఇందులో అర్జున్‌ రాంపాల్‌, అనిల్‌ రావిపూడి మధ్య సంభాషణ కూడా వుంది. అర్జున్‌ రాంపాల్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. హదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఉగాది సందర్భంగా బాలకృష్ణ ను రెండు డిఫరెంట్‌ లుక్‌లో ప్రజంట్‌ చేస్తూ మే కర్స్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. సి రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్‌, రాజీవ్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌. వెంకట్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement