Wednesday, May 8, 2024

తన కోరిక బయటపెట్టిన ఉప్పెన బ్యూటీ

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఉప్పెన. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోటంతో పాటు తెలుగులో వరుస అవకాశాలు పొందింది కృతి శెట్టి. నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తోంది. అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. అలాగే సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కూడా అవకాశం పొందింది.

ఇదిలా ఉండగా ఇటీవల ఉప్పెన సినిమాకి ముందు జరిగిన కొన్ని సంఘటనలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కృతి శెట్టి. షూటింగ్ కి ముందు దర్శకుడు బుచ్చి బాబు తనను కొన్ని సినిమాలు చూడమని కోరాడట. అయితే వాటిలో రంగస్థలం బాగా నచ్చిందని ఆ సినిమా చూశాక రాంచరణ్ అభిమాని అయిపోయానని చెప్పుకొచ్చింది. ఆయనతో ఓ సినిమా చేయటం తన కోరిక అని పేర్కొంది కృతి శెట్టి.

Advertisement

తాజా వార్తలు

Advertisement