Monday, May 6, 2024

ఎన్నికల్లో పోటీ చేస్తా… గెలిపిస్తారా !! కన్నడ స్టార్ ఉపేంద్ర

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది అభిమానుల మన్ననలు పొందాడు ఉపేంద్ర. అయితే ఉపేంద్ర చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. నాకు సీఎం అవ్వాలని ఉంది… ఎన్నికల్లో పోటీ చేస్తే నన్ను గెలిపిస్తారా అంటూ ఓ లేఖను విడుదల చేశాడు ఉపేంద్ర.

తాను రాజకీయాల్లోకి వస్తే నిరంతరం ప్రజా సేవలోనే ఉంటానని సీఎం కామన్ మ్యాన్ అన్న పదానికి సరైన అర్థం తెలియజేస్తానని తెలిపారు ఉపేంద్ర. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకి తానే జవాబుదారి అని ప్రజల నిర్ణయమే తన నిర్ణయంగా ఉంటానని లేఖలో పేర్కొన్నారు. ఉపేంద్ర విడుదల చేసిన ఈ లేఖ కన్నడనాట ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. మరి ఉపేంద్ర నిజంగానే రాజకీయాలలోకి రాబోతున్నారో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement