Friday, May 3, 2024

షాకింగ్ న్యూస్.. ఒకే వ్యక్తిలో మూడు రకాల ఫంగస్‌లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఘ‌జియాబాద్ ప‌ట్ట‌ణంలో ఆరోగ్య నిపుణులనే ఆశ్చ‌ర్యానికి గురిచేసే ఒక విచిత్ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. 45 ఏళ్ల వ్యక్తి సైన‌స్‌కు సీటీ స్కాన్ నిర్వ‌హించ‌గా రిపోర్టు నార్మ‌ల్‌గా వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఎండోస్కోపీ నిర్వ‌హించ‌గా అతడిలో మూడు ర‌కాల ఫంగ‌స్‌లు (బ్లాక్‌, వైట్‌, యెల్లో) ఉన్న‌ట్లు తేలింది.

అయితే యెల్లో ఫంగ‌స్ సాధార‌ణంగా స‌రీసృపాల్లో క‌నిపిస్తుందని, మాన‌వుల్లో ఈ ర‌కం ఫంగ‌స్‌ను గుర్తించ‌డం ఇదే తొలిసారి అని ఘ‌జియాబాద్‌కు చెందిన‌ ఈఎన్‌టీ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ బీపీ త్యాగి చెప్పారు. మాన‌వుల్లో యెల్లో ఫంగ‌స్ ఆన‌వాళ్లకు సంబంధించి ఏ జ‌ర్న‌ల్‌లోనో రిఫ‌రెన్స్ లేద‌న్నారు. ఈ ఫంగ‌స్ ఆంఫోటెరిసిన్-బి అనే ఔష‌ధం ద్వారా క్యూర్ అవుతుంద‌ని, కానీ వైట్‌, బ్లాక్ ఫంగ‌స్‌ల‌తో పోల్చితే యెల్లో ఫంగ‌స్ నుంచి క్యూర్ కావ‌డానికి ఎక్కువ టైమ్ ప‌డుతుంద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement